: క్యాష్ డెలివరీ వ్యాన్ పై ఉగ్రవాదుల దాడి.. ఏడుగురి కాల్చివేత!


జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో దారుణం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కు చెందిన క్యాష్ డెలివరీ వ్యాన్ పై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేసి, ఏడుగురిని కాల్చివేశారు. ఈ సంఘటనలో ఐదుగురు పోలీస్ సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దక్షిణ కాశ్మీర్ లోని కుల్గాంలో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ బయట ఉన్న క్యాష్ డెలివరీ వ్యాన్ పై ఈ దాడి జరిగింది.

గుర్తుతెలియని సాయుధులు ఇద్దరు వ్యాన్ లో డబ్బును దోచుకుపోయేందుకు విఫలయత్నం చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నీహమా గ్రామంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ శాఖలో డబ్బు డిపాజిట్ చేసి కుల్గాం టౌన్ కు తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలిపారు. ఈ సంఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News