: థియేటర్ మేనేజర్ అరెస్ట్... వరంగల్ థియేటర్‌లో బాహుబలి-2 నిలిపివేత!
‘బాహుబలి-2’ సినిమా ప్రదర్శనకు సంబంధించి అటు ఆన్‌లైన్‌తో పాటు, ఇటు ఆఫ్‌లైన్ టికెట్లను విక్రయించింది వరంగల్ జిల్లా కేంద్రంలోని రామ్‌లక్ష్మణ్ థియేటర్ యాజమాన్యం. అయితే, ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకున్నవారు థియేటర్‌లోకి రాకూడదని సిబ్బంది చెప్పడంతో, మరి ఎందుకు టికెట్‌లు అమ్మారంటూ ప్రేక్షకులు థియేటర్ వద్ద ఆందోళన చేయడంతో బాహుబలి-2 ప్రదర్శన నిలిచిపోయింది. ఈ థియేటర్ వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ నిమిత్తం సినిమా హాల్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాహుబలి-2 సినిమా కోసం టికెట్లు తీసుకున్న అభిమానులు అసంతృప్తితో వెనుదిరిగారు.