: 20 ఏళ్ల ముందు నువ్వు వచ్చుంటే ఆర్మాల్డ్, స్టాలోన్ లు దిగదుడుపే!: రానా కండలపై రాంగోపాల్ వర్మ


మాహిష్మతి సామ్రాజ్యాన్ని, అందులోని వ్యక్తులను చూసి మైమరచిపోయి, తనదైన ట్వీట్ల ద్వారా ప్రశంసల వర్షం కురిపిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఈసారి భల్లాల దేవుడిని పొగడ్తలతో ముంచెత్తాడు. "రానా... చిత్రంలో నువ్వు చూపిన పవర్ అత్యద్భుతం. ఒకవేళ బాహుబలి రెండో భాగం ఓ 20 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే, స్వార్జ్ నెగ్గర్, స్టాలోన్ లు నీ ముందు దిగదుడుపు అయ్యుండేవారు" అని రానా కండలను ప్రస్తావిస్తూ, ట్వీట్ చేశారు. ఈ ఉదయం 9:45 గంటల సమయంలో రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయగా, ఆపై వెంటనే రానా స్పందిస్తూ, నమస్కారం పెడుతున్న ఎమోజీలు పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News