: నేడే జగన్ రైతు దీక్ష... సర్వం సిద్ధం చేసిన వైఎస్సార్సీపీ!


వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో ప్రైవేటు ప్రాంగణంలో రైతు దీక్ష చేపట్టనున్నారు. నేటి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుని, రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు గుంటూరు బస్టాండ్‌ సెంటర్‌ కు జగన్ చేరుకుంటారు. అనంతరం అక్కడ నిర్వహించనున్న మేడే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ కార్మిక దినోత్సవ పతాకావిష్కరణ చేస్తారు.

అనంతరం అక్కడికి దగ్గర్లోని దీక్షా స్థలికి 10.30 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం రైతు దీక్ష చేపడతారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. జగన్ దీక్షకు కూర్చోవడానికి ప్రధాన వేదికను, అలాగే రైతన్నల కడగండ్లపై కళాకారుల ప్రదర్శనకు మరో వేదికను ఏర్పాటు చేశారు. ఇక పార్టీ నేతలు, రైతులు, ప్రజలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News