: బౌలర్లను ఉతికి ఆరేసిన వార్నర్.. ఉప్పల్‌లో పరుగుల సునామీ.. 43 బంతుల్లోనే శతకం పూర్తి!


పరుగుల సునామీ, ఊచకోత, చుక్కలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్‌కు ఈ పదాలు సరిపోవేమో. ఆదివారం ఉప్పల్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ శివాలెత్తిపోయాడు. పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. బంతి కనిపిస్తే పాపం.. అన్నట్టు ఊచకోత కోశాడు. అతడి బాదుడుకు బంతులు దిక్కులు చూశాయి. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ ఆ తర్వాత మరింత జోరు పెంచాడు.

బంతిని ఇష్టం వచ్చినట్టు బాదుతూ 43 బంతుల్లోనే 9 ఫోర్లు 8 సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఊపు తగ్గించలేదు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 10 ఫోర్లు, 8  సిక్స్‌లతో 126 పరుగులు చేసి అభిమానులకు ఐపీఎల్ అసలైన మజా అందించాడు. వార్నర్ దెబ్బతో హైదరాబాద్ ఓవరాల్‌గా ఆరో విజయంతో నాకౌట్‌కు చేరువైంది.

  • Loading...

More Telugu News