: చిరంజీవి ఇంట్లో వేడుక... కేక్ కట్ చేసిన ‘మెగా’ హీరోలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్థాపించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు. ‘మా సంస్థలో పనిచేయబోతున్న సురేందర్ రెడ్డికి స్వాగతం’ అని రామ్ చరణ్ ఆహ్వానం పలికారు. కాగా, కొణిదెల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో చిరంజీవి 151వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.