: శ్రమ శక్తికి తిరుగులేదని చాటే ఘనమైన రోజు: పవన్ కల్యాణ్
శ్రమ శక్తికి తిరుగులేదని చాటే ఘనమైన రోజు మేడే అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రపంచమంతా కలిసి మే 1న జరుపుకొనే ఏకైక వేడుక మే డే అన్నారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలమయం కావాలని, తెలుగు రాష్ట్రాలు, ప్రపంచంలోని శ్రామికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆ ప్రకటనలో పవన్ పేర్కొన్నారు.