: మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య!
హైదరాబాద్ లో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక గంగారంలో నివాసం ఉంటున్న వినీల (25) ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. వినీల తన ఇంట్లో ఉరి వేసుకుని ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడినట్టు చందానగర్ పోలీసులు తెలిపారు. వినీల ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తూ తమకు ఫిర్యాదు చేశారని, ఈ కేసు దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు.