: అక్కాచెల్లెళ్లయినా సరే కలిసుండకూడదు... పాక్ ప్రముఖ యూనివర్సిటీలో వికృత నిబంధన!


పాకిస్థాన్‌లో ప్రముఖ యూనివర్సిటీగా గుర్తింపున్న ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ యూనివర్సిటీ (ఐఐయూ) ఓ వికృత నిబంధనను తీసుకువచ్చింది. యూనివర్శిటీల్లో అమ్మాయిలెవరూ హాస్టల్‌ గదులలో పడకను పంచుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. ఏ అమ్మాయి కూడా, తన స్నేహితులతోగానీ, చివరకు అక్కాచెల్లెళ్లతోగానీ పడకను షేర్‌ చేసుకుంటే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఒకే దుప్పటి కప్పుకొని పడుకోకూడదని, కనీసం మంచం మీద కూర్చున్నా అంగీకరించేది లేదని, రెండు మంచాల మధ్యా దూరాన్ని పాటించాలని సూచించింది. ఇక అబ్బాయిల హాస్టళ్లలో విద్యార్థులు కాని వారు కూడా పెద్ద సంఖ్యలో తిష్ట వేసినా పట్టించుకోని వర్సిటీ, అమ్మాయిల హాస్టళ్లపై వివక్ష చూపుతూ, ఈ తరహా నిబంధనలు విధించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News