: శిల్పా సోదరులు, భూమా అఖిల ప్రియతో భేటీ కానున్న టీడీపీ అధిష్ఠానం

భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ నుంచి టికెట్ కోసం భూమా కుటుంబ స‌భ్యులు, శిల్పా సోద‌రులు  ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. టీడీపీ నుంచి వారిలో ఎవరు టికెట్ పొందుతారన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్ప‌టికే త‌మ పార్టీ అధిష్ఠానంతో వారు ప‌లు సార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ వివాదానికి తెర‌దించేందుకు టీడీపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబుతో శిల్పా సోద‌రులు భేటీ అయి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. కాగా, మంత్రి అఖిల ప్రియ‌, ఎస్వీ మోహ‌న్ రెడ్డి, ఎస్పీవై రెడ్డితో టీడీపీ అధిష్ఠానం కాసేప‌ట్లో మరోసారి భేటీ కానుంది. మంత్రి క‌ళా వెంక‌ట్రావుతో వారు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News