: పులులు, ఏనుగును దత్తత తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మూడు పులి పిల్లలు, ఒక ఏనుగు పిల్లను దత్తత తీసుకున్నారు. బెంగళూరు సమీపంలో ఉన్న బన్నేరుఘట్ట జంతు ప్రదర్శనశాలలో ఈ జంతువులు ఉన్నాయి. ఈ జూను సందర్శించిన ఆయన ఆడపులి పిల్లలకు అరుణ్య, శాంభవి అని... మగపులి పిల్లకు శివ అని పేరు పెట్టారు. ఏనుగు పిల్లకు తనకు ఆప్త మిత్రుడైన ఎంపీ శ్రీరాములు పేరు పెట్టారు. వీటి పోషణకు గాను జూ అధికారులకు రూ. 4.75 లక్షలు చెల్లించారు. అంతేకాదు, ప్రతి ఏటా జంతువులను దత్తత తీసుకుంటానని ఆయన తెలిపారు.