: అవును... తప్పు చేశాం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

"గడచిన రెండు రోజుల్లోను..  నేడు ఎంతో మంది కార్యకర్తలతో, ఓటర్లతో మాట్లాడాను. నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. అవును, మేము తప్పు చేశాం. అయితే తప్పులను పరిశీలించుకుని సరిదిద్దుకుంటాం. తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తాం. ఓటర్లకు, కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం. మాకు మేమే ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. ఇది క్షమాపణలు చెప్పే సమయం కాదు. చేసి చూపించాల్సిన సమయం. తిరిగి పనిలో నిమగ్నం కావాల్సిన సమయం వచ్చింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పునే మేం చేసి చూపిస్తాం - జైహింద్" అని ఢిల్లీ ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయని చెప్పిన కేజ్రీవాల్, రెండు రోజుల తరువాత ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ పెట్టడం గమనార్హం.

More Telugu News