: చంద్రబాబు సర్కారు ఒప్పందంపై ఆరా తీస్తున్న అమెరికా!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ 'కియ'తో ఏపీ ప్రభుత్వం డీల్ కుదుర్చుకోవడాన్ని అమెరికా నిశితంగా గమనిస్తోంది. అసలు తమకు ఎంతమాత్రమూ తెలియకుండా, తమ అధికారులకు సమాచారం లేకుండా, ఇంత పెద్ద ఒప్పందం ఎలా కుదిరిందా? అని ఆరా తీస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన 'కియ' అనంతపురంలో దాదాపు రూ. 13 వేల కోట్ల పెట్టుబడులతో కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డీల్ గురించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు అమెరికన్ కాన్సులేట్ సిబ్బంది స్వయంగా సీఎం కార్యాలయానికి వచ్చారు. ఆ సంస్థ నిజంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందా? అని సీఎంఓ అధికారులను వారు అడగడం గమనార్హం. అమెరికన్ కాన్సులేట్ వర్గాలే ఈ డీల్ పై ఆరా తీయడం ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులనూ ఆశ్చర్యానికి గురి చేసింది.