: మోదీ వల్ల కాకపోతే ఉగ్రవాదుల భరతం నేనే పడతా.. కెప్టెన్ ఆయుష్ తల్లి శపథం!
ఉగ్రవాదులను ఏరివేయడం మోదీకి చేతకాకపోతే ఆ పనేదో తానే చేస్తానని ఓ అమర జవాను తల్లి శపథం చేసింది. ‘‘ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడంలో మోదీ విఫలమైతే నా కుమారుడి మృతికి నేనే ప్రతీకారం తీర్చుకుంటా’’ అని కుప్వారా ఉగ్రదాడిలో మృతి చెందిన కెప్టెన్ ఆయుష్ యాదవ్ తల్లి శపథం చేసింది. ఉగ్రవాదుల దాడికి ముందురోజు కొడుకు తనతో మాట్లాడాడని, ఆ తర్వాతి రోజే అతడి మృతి వార్త తెలిసిందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమె, తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని స్పష్టం చేసింది. ఆయుష్ తండ్రి మాట్లాడుతూ ప్రభుత్వంపై తమకు ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.