: హైదరాబాద్ లో వర్షం.. సేదతీరిన నగరవాసులు!


ఠారెత్తిస్తోన్న ఎండ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ న‌గ‌ర‌వాసులు ఈ రోజు కురిసిన చిరుజ‌ల్లుల‌తో కాస్త ఉప‌శ‌మ‌నం పొందారు. ఈ రోజు సాయంత్రం వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డడంతో హైద‌రాబాదీయులు సేద‌తీరారు. హైద‌రాబాద్‌లోని పద్మారావునగర్, బేగంపేట, మోండా మార్కెట్, బోయిన్‌పల్లి, ప్యాట్నీ, మారేడ్‌పల్లి, ఉప్పల్, రామంతాపూర్, కూకట్‌పల్లి, పార్శీ గుట్ట, చిలకలగూడతో పాటు ప‌లు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం కార‌ణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మొత్తానికి వేసవి మధ్యలో వరుణుడు కాస్త కరుణించడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News