: కేసీఆర్ చేతకాని దద్దమ్మ.. కేకే ఓ సన్నాసి!: సర్వే సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు
వరంగల్ లో నిన్న జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ చేతకాని దద్దమ్మ.. కేకే ఓ సన్నాసి. డీఎస్ లాంటి దద్దమ్మలను పార్టీలో చేర్చుకున్న పెద్ద దద్దమ్మ కేసీఆర్.బాహుబలి కాదు.. పెద్ద బఫూన్. ‘కబాలి’ సినిమాలా.. వరంగల్ సభ పెద్ద ప్లాప్ షో..’ అంటూ మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించడం యాక్సిడెంటల్ గా జరిగిందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని సర్వే అన్నారు.