: అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్న చంద్ర‌బాబు, లోకేశ్, య‌న‌మ‌ల‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే నెల 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటించనున్నట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ఈ ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు నాయుడితో పాటు ఏపీ మంత్రులు లోకేశ్‌, యనమల రామకృష్ణుడు స‌హా మొత్తం 17 మంది సభ్యుల బృందం వెళుతున్నారు. వారంతా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, సాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగోల్లో పర్యటించి అక్క‌డి ప‌లువురు అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. అలాగే యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యాన్యువల్ వెస్ట్ కోస్ట్ సమ్మిట్-2017కి కూడా వారు హాజ‌రవుతారు.

  • Loading...

More Telugu News