: జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జూన్ 9కి వాయిదా
వైఎస్సార్సీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు దీనిని వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణను జూన్ 9వ తేదీన జరపనున్నామని సీబీఐ న్యాయస్థానం తెలిపింది. కాగా, జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కాసేపట్లో తీర్పు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.