: 'బాహుబలి' టికెట్ల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల ఒత్తిళ్లు.. ఒక్కొక్కరి వద్ద 3 వేల టికెట్లు!


దర్శక దిగ్గజం రాజమౌళి విజువల్ వండర్ 'బాహుబలి-2' సినిమాను చూసేందుకు సామాన్యులే కాదు వీఐపీలు సైతం తహతహలాడుతున్నారు. ఈ సినిమా టికెట్ల కోసం కృష్ణా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్త సంచలనం రేపుతోంది. ఒక్కో ప్రజాప్రతినిధి వద్ద 2 వేల నుంచి 3 వేల వరకు టికెట్లు ఉన్నాయన్న వార్త సగటు సినీ అభిమానిలో ఆగ్రహం నింపుతోంది. జిల్లా వ్యాప్తంగా 130 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. మరోవైపు ఆన్ లైన్లో టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో, థియేటర్ల వద్ద టికెట్లు దొరకడం గగనమైపోతోంది. దీంతో, అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News