: కోహ్లీ నవ్విన కారణాన్ని చెప్పిన జడేజా!
ఐపీఎల్ -10లో భాగంగా బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగిన సందర్భంలో విరాట్ కోహ్లీ విరగబడి నవ్వాడు. కోహ్లీ నవ్వుతున్న ఫొటోను ఆధారంగా చేసుకుని ఆ నవ్వుకు కారణం రవీంద్ర జడేజా న్యూలుక్ అనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అయితే, అసలు విషయాన్ని జడేజా బయటపెట్టాడు. ఈ ఫోటోకు ముందు, కోహ్లీ.. తనను ‘రాజ్ పుత్’ అని పిలిచాడని, తనను ముద్దుగా అలా పిలుస్తుంటాడని.. తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ లో భాగంగానే కోహ్లీ అలా నవ్వాడని జడేజా చెప్పాడు.