: ఎవరికీ బెదరం..ఢిల్లీ కోటలో పాగావేస్తాం: మమతా బెనర్జీ
ఎవరికీ బెదరమని.. ఎవరు సవాల్ చేసినా స్వీకరిస్తానని.. ఢిల్లీ కోటలో పాగా వేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బిర్పారలో ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బెదిరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇలాంటి వాటికి బెంగాల్ ఎప్పుడూ భయపడదని అన్నారు. బెంగాల్ లో అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని, తమ పార్టీ నేతలపై సీబీఐని ప్రేరేపిస్తున్నారని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లోని వెనుకబడిన ప్రాంతాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించడంపై మమత స్పందిస్తూ, ఢిల్లీ నుంచి వచ్చిన వారు అబద్ధాలు చెబుతారని, వాళ్లు అధికార కాంక్షతో ఉన్నారని విమర్శించారు.