: చిరుత రావడంతో ఐదు గంటలు బిక్కుబిక్కుమంటూ గడిపిన కుటుంబం!


హర్యానాలోని గుడ్‌గావ్‌కు సమీపంలోని సోహ్నా దుర్గా కాలనీలోకి ఓ చిరుత ప్రవేశించి కలకలం రేపింది. సుమారు ఐదు గంట‌ల పాటు ఆ కాల‌నీవాసుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టింది. అరవెల్లి అటవీప్రాంతం నుంచి వ‌చ్చిన ఈ చిరుత ఈ కాల‌నీలో ఇద్ద‌రిని గాయపరిచింది. ఈ దాడిలో 23 ఏళ్ల లవకుమార్‌ ముఖంపై గాయాలు కాగా, ఆరేళ్ల బాలుడి ఛాతి, భుజాలపై గాయాలు అయ్యాయి.

అనంత‌రం ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఆ చిరుతను చూసిన ఆ ఇంట్లో వేరే గదిలో వున్న వ్య‌క్తి కేకలు వేయడంతో, ఇంట్లోని వారు లోపలి నుంచి తలుపులు వేసుకున్నారు. అప్ప‌టి నుంచి సుమారు ఐదు గంట‌ల‌వ‌ర‌కు ఆ ఇంట్లో వారు బ‌య‌ట‌కు రాకుండా భ‌యాందోళ‌న‌ల మ‌ధ్య గ‌డిపారు. అక్క‌డ‌కు చేరుకున్న‌ అటవీశాఖ అధికారులు వల సాయంతో చిరుతను బంధించడానికి విఫ‌ల‌య‌త్నం చేశారు. కాసేప‌టికి అదనపు సిబ్బందిని రప్పించి ఎట్ట‌కేల‌కు దాన్ని పట్టుకుని తీసుకెళ్లారు. చిరుత‌లు జనావాసాల్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయ‌ని స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News