: ఈ సారి అభిమానులను ఖుషీ చేసిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ప్రవేశించి బిజీబిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం బేవాచ్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌కి ఎంతో కాలంగా దూరంగా ఉన్న ఈ బ్యూటీ బేవాచ్ టీమ్ విడుదల చేసిన మొదటి రెండు ట్రైలర్లలో సరిగా కనిపించలేదు. దీంతో ఈ అమ్మడి ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కాగా, ఇప్పుడు ఆ సినిమా మరో ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో మాత్రం ఈ అమ్మడు ఎక్కువ సేపు కనపడుతోంది. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్, కెల్లీ రోహ్రబాక్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. ఈ ట్రైలర్‌ను మీరూ చూడండి...