: బాహుబలి ఖాతాలో మరో రికార్డు
'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా వరుస రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి సంబందించిన టికెట్లను ఆన్ లైన్ పోర్టల్ లో విక్రయానికి పెట్టడంతో, ప్రేక్షకులు ఆన్ లైన్ పోర్టల్ కు పోటెత్తారని, దీంతో కేవలం 24 గంటల్లోనే పది లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని విక్రేతలు తెలిపారు. ఇది సినీ చరిత్రలో రికార్డు అని వారు వెల్లడించారు. ఇంత భారీ మొత్తంలో గతంలో టికెట్ల విక్రయం జరగలేదని సదరు ఆన్ లైన్ పోర్టల్ వెల్లడించింది.