: మావో నేతల అరెస్ట్ కు యత్నించండి... లొంగకుంటే నిర్దాక్షిణ్యంగా చంపేయండి: జవాన్లకు కేంద్రం ఆదేశం
మావోయిస్టు క్యాడర్ కు బదులు లీడర్లను టార్గెట్ చేయాలని, వారిని చుట్టుముట్టిన తరువాత, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించాలని, వారు లొంగకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని కేంద్రం నుంచి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ జవాన్లకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మావోయిస్టులన్న పదం ఎక్కడా వినపడకుండా చేయాలని, వారి కదలికలపై పూర్తి నిఘా పెట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని హోం శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలపై దృష్టిని సారించాలని తెలిపింది. అందుబాటులో ఉన్న అన్ని అత్యాధునిక ఆయుధాలనూ ఉపయోగించుకోవాలని, మరోసారి సుక్మా తరహా దాడి జరగకుండా చూడాలని, అందుకోసం మరిన్ని బలగాలతో ఏఓబీ, బస్తర్ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించింది.