: టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ.. కేసీఆర్ షెడ్యూల్ ఇదే.. వరంగల్‌లోనే బస
టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ కోసం నేటి సాయంత్రం వరంగల్ చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రేపు కూడా బిజీబిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న కేసీఆర్, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4.30 గంటలకు హన్మకొండలోని సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు.
సాయంత్రం 6 గంటలకు వరంగల్ బహిరంగ సభకు చేరుకుని 8 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం రాత్రి తిరిగి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటకి చేరుకుని బసచేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే జనగామ జిల్లా పాలకుర్తిలోని సోమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. అనంతరం బమ్మెర పోతన సమాధిని సందర్శిస్తారు. రాఘవాపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.