: వరంగల్ టీఆర్ఎస్ సభ పార్కింగ్ జోన్‌కు.. గూగుల్ మ్యాప్‌కు లింక్!
వరంగల్‌లో నేడు (గురువారం) జరగనున్న టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ కోసం ప్రత్యేకంగా 9 పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వాహనదారులకు ఇబ్బంది లేకుండా నేరుగా ఈ పార్కింగ్ జోన్లకు చేరుకునేందుకు వీలుగా ఈ పార్కింగ్ జోన్లను గూగుల్ మ్యాప్‌కు లింక్ చేశారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను సభ నిర్వాహకులు ఇప్పటికే ఆయా జిల్లాల నేతలకు వాట్సాప్ ద్వారా పంపించారు. సభకు రావాలనుకున్నవారు ఈ లింక్ ద్వారా నేరుగా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.