: సీఆర్పీఎఫ్ కు నూతన డీజీ నియామకం!


సీఆర్పీఎఫ్ కు నూతన డీజీగా రాయ్ భట్నాగర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా సీఆర్పీఎఫ్ కు పూర్తి కాల డీజీ లేరు. సీఆర్పీఎఫ్ కు తాత్కాలిక డీజీగా ప్రస్తుతం సుదీప్ లక్టాకియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, 1983 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి రాయ్ భట్నాగర్. ఇదిలా ఉండగా, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కు కొత్త డీజీగా ఆర్కే పచ్ నందను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.1983 ఐపీఎస్ బ్యాచ్.. పశ్చిమబెంగాల్ కేడర్ కు చెందిన అధికారి ఆయన.  

  • Loading...

More Telugu News