: బాలింతలు చనిపోతుంటే..‘ప్లీనరీ’ పేరిట సంబరాలు చేసుకుంటారా?: టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద విరుచుకుపడ్డారు. సరైన వైద్యం అందక బాలింతలు చనిపోతుంటే..టీఆర్ఎస్ ప్లీనరీ పేరుతో ఆయన సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఆ పదవికి ఆయన అనర్హుడని, టీఎస్ఎంఐడీసీ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాసిరకం మందులు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని కోఠి మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అక్కడ మరణాలు సంభవించాయని ఆరోపించారు.