: ‘ధోనీ’ హీరోకు, అభిమానులకు మధ్య మాటామాటా.. వాచ్ మెన్ పై దాడి !


‘ధోనీ’ చిత్రం హీరో సుశాంత్ సింగ్ కు, అభిమానులకు మధ్య మాటామాటా పెరిగిన క్రమంలో అతని ఇంటి వాచ్ మెన్ పై ఫ్యాన్స్ దాడికి దిగారు. ఈ సంఘటన నిన్న ముంబయిలో జరిగింది. నిన్న అర్ధరాత్రి సుశాంత్ తన కొత్త కారు ‘మసెరటి’లో ముంబయిలోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లాడు. అయితే, సుశాంత్ ను చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

కానీ, అందుకు, సుశాంత్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత తన కారులో ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సుశాంత్ వాహనాన్ని కొంత మంది అభిమానులు వెంబడిస్తూ అతని ఇంటి వరకు వెళ్లారు. దీంతో, సుశాంత్, అతని వాచ్ మెన్ ఆ అభిమానులను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. ఈ క్రమంలో సుశాంత్ కు అభిమానులకు మధ్య మాటా మాటా పెరగడం, అతని వాచ్ మెన్ పై వారు దాడి చేయడం జరిగిందని సమాచారం.

  • Loading...

More Telugu News