: విమానంలో ‘భారీ’ కుందేలు మృతి.. ఉద్వేగానికిలోనైన కుందేలు యజమానురాలు


యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 767 విమానంలో ప్రపంచంలోనే అతిపెద్ద కుందేలుగా గిన్నీస్‌ రికార్డులకెక్కిన సిమోన్ మృతి చెందింది. ఆ కుందేలును పెంచుకుంటున్న ఆనెట్ ఎడ్వ‌ర్డ్స్ అనే మ‌హిళ దాన్ని తీసుకొని లండన్‌లోని హీత్రో విమానాశ్రయం నుంచి చికాగో బయలుదేరింది. ఆ కుందేలును చికాగోలో మ‌రొక‌రికి అప్ప‌గించాల‌నుకుంది. అంత‌కు ఒకరోజు ముందే ఆ కుందేలుకి అన్ని వైద్య పరీక్షలు కూడా చేయించి, అది పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు నిర్ధారించుకుంది. అయిన‌ప్ప‌టికీ సిమోన్‌ ఉన్నట్టుండి విమానంలోనే మృతి చెంద‌డం ప‌ట్ల ఆనెట్‌ ఉద్వేగానికి లోనైంది. ఈ సంద‌ర్భంగా ఆనెట్ మాట్లాడుతూ... తాను ఇప్ప‌టివ‌ర‌కు చాలా కుందేళ్లను విమానాల్లో తరలించానని, తొలిసారి ఓ కుందేలు ఇలా ప్రాణాలు కోల్పోయింద‌ని చెప్పింది. ఈ అంశంపై ద‌ర్యాప్తు చేయిస్తామ‌ని, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం తెలిపింది.

  • Loading...

More Telugu News