: గోవా నుంచి వచ్చిన రాష్ట్రపతి... పాదాభివందనం చేసిన కేసీఆర్
ఉస్మానియా వందేళ్ల ఉత్సవాల్లో పాల్గొనేందుకు గోవా నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేసి, పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, కేశవరావు, త్రివిధ దళాల అధిపతులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్వామిగౌడ్, మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులను ప్రణబ్ ముఖర్జీకి కేసీఆర్ పరిచయం చేశారు. రాష్ట్రపతి కాన్వాయ్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి వెళ్లింది.