: మార్కెట్లోకి బాహుబలి-2 చీరలు!


'బాహుబలి-2' సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గుజరాత్ లోని సూరత్ లో అయితే ఏకంగా బాహుబలి-2 చీరలు రూపొందిస్తున్నారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి కమలేష్ భాయ్ ఈ చీరలను డిజిటల్ ప్రింటింగ్ ద్వారా తయారు చేయించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ చీరలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చీరలపై హీరో ప్రభాస్, హీరో అనుష్కలతో పాటు సినిమాలోని పలు సన్నివేశాలను ముద్రించారు. ఇప్పటి వరకు 20 వేల చీరలను ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లోని వివిధ ప్రాంతాలకు పంపామని కమలేష్ భాయ్ తెలిపారు. 

  • Loading...

More Telugu News