: రాహుల్ ద్రవిడ్ అంటే చాలా ఇష్టం అంటున్న కత్రినా కైఫ్


టీమిండియాలో సచిన్, గంగూలీలకు సమకాలీనుడిగా ఉండడం రాహుల్ ద్రవిడ్ దురదృష్టం అని చాలా మంది వెటరన్ లు పేర్కొంటుంటారు. రాహుల్ ద్రవిడ్ ప్రతిభకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని ప్రతిఒక్కరూ భావిస్తారు. రాహుల్ ద్రవిడ్ కనుక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల ఆటగాడై ఉంటే ఆయనకు దక్కని పురస్కారం ఉండేది కాదనడంలో అతిశయోక్తి లేదంటారు. నోటితో కాకుండా బ్యాటుతో సమాధానం చెప్పే ద్రవిడ్ అంటే ఇండియన్ క్రికెట్ లో ఇష్టపడని వారుండరు.

తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్ కు కూడా రాహుల్ ద్రవిడ్ కు తాను వీరాభిమానినని తెలిపింది. రాహుల్ ద్రవిడ్ జంటిల్ మన్ గేమ్ లో నిజమైన జంటిల్ మన్ అని అభిప్రాయపడింది. ద్రవిడ్ ఏనాడూ నిరాశకు లోను కావడం, ప్రత్యర్థి ఆటగాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం తానెప్పుడూ చూళ్లేదని తెలిపింది. అంతే కాకుండా ద్రవిడ్ కు చాలా సిగ్గని చెప్పింది. రెండు మూడు మాటలు కన్నా ఎక్కువ మాట్లాడడని కత్రినా వెల్లడించింది.  

  • Loading...

More Telugu News