: లేడీ బాస్ ను తుపాకితో కాల్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి


తన లేడీ బాస్ ను తుపాకితో కాల్చి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ ఉద్యోగి. ఈ ఘటన అమెరికాలోని ఉత్తర డల్లాస్ లో జరిగింది. డల్లాస్ కాలమానం ప్రకారం ఈ ఘటన నిన్న ఉదయం 10.45 గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి తుపాకితో ఉన్నాడంటూ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకుని విచారించగా... సమావేశ మందిరంలో సదరు వ్యక్తి ఉన్నాడని అక్కడి వారు చెప్పారు.

దీంతో, షాట్ గన్ తో పేల్చి, తలుపును ఓపెన్ చేసి లోపలకు వెళ్లారు పోలీసులు. లోపల ఓ మహిళ, షూటర్ ఇద్దరూ చనిపోయి పడి ఉన్నారు. షూటర్ కాల్చి చంపిన మహిళ అతడి సూపర్ వైజర్ అని పోలీసులు నిర్ధారించారు. ముందుగా మహిళను కాల్చి చంపి, ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని చెప్పారు. జరిగిన ఘటనతో ఆ బహుళ అంతస్తుల భవనంలో భయాందోళనలు నెలకొన్నాయి. 

  • Loading...

More Telugu News