: రాష్ట్రపతి రేసులో బీహార్ సీఎం నితీశ్ కుమార్.. కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు
ప్రణబ్ స్థానంలో రాష్ట్రపతి పగ్గాలు చేపట్టేదెవరన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జేడీయూ కార్యదర్శి కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీశ్ కుమార్ రాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హుడని ఆయన పేర్కొన్నారు. మాండ్యాలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ రాష్ట్రపతి కావాలని జేడీయూ సహా భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. ఈ విషయమై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని త్యాగి పిలుపునిచ్చారు.