: సిమెంట్ ధరల అంశంపై సీఎం చాలా సీరియస్ గా ఉన్నారు: నారా లోకేష్

సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో పంచాయతీరాజ్ ఉత్సవాల్లో నారా లోకేష్ మాట్లాడుతున్న సమయంలో సిమెంట్ ధరలు పెరిగిపోయిన అంశాన్ని స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రస్తావించారు. సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో తమ గ్రామాల్లో ప్రభుత్వ నిర్మాణాలు నిలిచిపోయాయని ప్రతినిధులు వాపోయారు. దీంతో, వారితో లోకేష్ మాట్లాడుతూ, ఈ అంశంపై సీఎం కూడా సీరియస్ గా ఉన్నారని, సిమెంట్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. సిమెంట్ కంపెనీల యజమానులతో మంత్రులు మాట్లాడారని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు.

More Telugu News