: త్వరలో ప్రారంభం కానున్న ఉదయ్ రైళ్లు.. ప్రత్యేకతలు!
2016-17 బడ్జెట్ లో భారత రైల్వే శాఖ ఉదయ్ (ఉత్ క్రిష్ట్ డబుల్ డెకర్ ఏసీ యాత్రి) రైలు సర్వీసులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులైలో ఉదయ్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా, రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ-లక్నో వంటి మార్గాల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. సాధారణ రైళ్లలో ప్రయాణికుల కంటే నలభై శాతం ఎక్కువ మంది ఈ రైళ్లలో ప్రయాణించే సామర్థ్యం ఉంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఉదయ్ రైళ్ల ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..
* బోగీల్లో ఎల్ సీడీ స్క్రీన్లు, వైఫై స్పీకర్ సిస్టమ్స్
* రైలు లోపలి భాగం అత్యాధునిక టెక్నాలజీతో చేసిన డిజైనింగ్, బయో టాయ్ లెట్లు
* రాత్రి వేళల్లో ఈ రైళ్లు ప్రయాణించినప్పటికీ ఇందులో బెర్త్ లు ఉండవు. కానీ, చాలా సౌకర్యవంతంగా ఉండే కుర్చీలను
అమర్చనున్నారు.
* టికెట్ ధరల విషయానికొస్తే.. థర్డ్ ఏసీ టికెట్ల కంటే కాస్త తక్కువగా ఉండనున్నాయి.