: నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ దుందుడుకు వైఖరిపై ఆరా తీసిన చంద్రబాబు

కర్ణాటకలోని ఓ టోల్ ప్లాజా వద్ద దాడికి దిగిన హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ వైఖరిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పార్టీ నేతల కుమారులతో ఇటీవలి కాలంలో తలనొప్పులు ఎదురయ్యాయని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ తరహా ఘటనలను చూస్తూ ఊరుకోబోయేది లేదని, చట్టం తన పని తాను చేసుకువెళుతుందని, ఎంతటివారైనా చట్టం ముందు ఒకటేనని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.

పోలవరం ప్రాజెక్టు పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశీలించిన చంద్రబాబు, అంతకు ముందు టోల్ ప్లాజా వద్ద అసలేం జరిగిందో నివేదిక ఇవ్వాలని కూడా కోరారు. కాగా, బాగేపల్లి టోల్ గేటు వద్ద జరిగిన ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్ లో అంబరీష్ స్పష్టంగా కనిపిస్తుండటం, ఆపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన చిక్ బళ్లాపూర్ ఎస్పీ స్వయంగా విచారణ ప్రారంభించారు. అంబరీష్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసు టీమ్ లను ఏర్పాటు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News