: కోహ్లీ 'పది ఓవర్ల' మాటను తు.చ తప్పక పాటించిన ఆటగాళ్లు... సెటైర్ల మీద సెటైర్లు!


"లక్ష్యం చిన్నదే. పది ఓవర్లలో మ్యాచ్ అయిపోవాలి" అని నిన్నటి మ్యాచ్ లో కోల్ కతా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత డ్రస్సింగ్ రూములో తన జట్టు సభ్యులతో కోహ్లీ చెప్పగా వారు దాన్ని తు.చ తప్పక పాటించారట. పది ఓవర్లలో గెలవాలన్న ఉద్దేశంతో కోహ్లీ చెబితే, పది ఓవర్లలో ముగియాలని కెప్టెన్ చెప్పాడు కాబట్టి, అలా వెళ్లి ఇలా వచ్చేద్దామని ఆటగాళ్లు భావించారట. అందుకే ఫలితం అలా వచ్చిందని సోషల్ మీడియాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర ఓటమిపై సెటైర్ల మీద సెటైర్లు వస్తున్నాయి.

శనివారం నాటి మ్యాచ్ లో ధోనీ చేసిన టోటల్ స్కోరు 61 కాగా, బెంగళూరు టీమంతా కలసి కూడా దాన్ని చేరుకోలేకపోయిందని అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. "ఈ సీజనులో కోహ్లీ టీము నుంచి ఆశించేది పెద్దగా లేదు", "ఆ టీమ్ కొత్త టోల్ నంబర్ - 70189820250" (ఆటగాళ్లు వరుసగా చేసిన స్కోరు) అంటూ విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ తదితరాల్లో వస్తున్న వ్యంగ్య కామెంట్లను అరాయించుకోవడం కోహ్లీ టీమ్ కు కష్టంగానే ఉంది.

  • Loading...

More Telugu News