: జయలలిత ఊటీ ఎస్టేట్ వాచ్ మెన్ దారుణ హత్య... ఆస్తి డాక్యుమెంట్లు దగ్ధం!

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఊటీలో ఉన్న 'కొడనాడ్' ఎస్టేట్ లో వాచ్ మెన్ గా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆపై ఆమె ఆస్తులకు సంబంధించిన కీలకమైన దస్తావేజులు, డాక్యుమెంట్లను దగ్ధం చేశారు. దుండగుల దుశ్చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించినందునే వాచ్ మెన్ ను హత్య చేశారని తెలుస్తోంది.

కాగా, ఈ ఎస్టేట్ విలువ సుమారు రూ. 1000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇదిలా ఉంచితే, వారం రోజుల క్రితం చెన్నైలోని జయలలిత గెస్ట్ హౌస్ లోనూ జయ ఆస్తి డాక్యుమెంట్లు కొన్ని తగులబడిన సంగతి తెలిసిందే. అమ్మ మరణం తరువాత, ఆమె ఆస్తులను ఆక్రమించుకోవడానికే దస్తావేజులను ప్లాన్ ప్రకారం నాశనం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఊటీ ఎస్టేట్ వాచ్ మెన్ హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

More Telugu News