: మోదీతో భేటీకి కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసీఆర్ భేటీకి అపాయింట్ మెంట్ ఖరారయింది. రేపు ఉదయం 11.45 గంటలకు ప్రధానితో కేసీఆర్ భేటీ కానున్నారు. రేపు ప్రధానితో భేటీ అయిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనున్నారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు, ఉచిత ఎరువుల పథకంతో పాటు పలు విషయాలను మోదీకి కేసీఆర్ వివరించనున్నారు.