: జూబ్లీహిల్స్‌లో రెచ్చిపోయిన బైక్ రేసర్లు.. బెంబేలెత్తిన వాహనదారులు

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ లో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. వాహనాల మధ్యనుంచి వేగంగా దూసుకెళ్తూ వాహనదారులు, పాదచారులను బెంబేలెత్తించారు. కేబీఆర్ పార్క్, జూబ్లీచెక్‌పోస్ట్, పంజాగుట్టలలో పెద్ద ఎత్తున బైక్ రేసులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. యువకులు బైక్ రేసులు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు కాపుకాసి రేసర్లను అడ్డుకున్నారు. 11 బైక్‌లను స్వాధీనం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. బైక్ రేసింగ్‌లు నిర్వహించిన యువకులపై కేసులు నమోదు చేస్తే వారి భవిష్యత్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి ఎదుటే కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి రేసింగ్ చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి వదిలిపెట్టారు.

More Telugu News