: 25 ఏళ్లుగా ఆకులు తింటూ బతుకుతున్నాడు!
ఓ వ్యక్తి ఆకులనే తింటూ బతుకుతున్నాడు. ఏదో ఒకటి, రెండు రోజులు, నెలలు కాదు.. ఆయన ఏకంగా గత 25 ఏళ్లుగా చెట్ల ఆకులను తింటూ జీవిస్తున్నాడు. డబ్బుల్లేక, పనిదొరకక అంతటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నప్పటికీ అతడు ఇన్నాళ్లూ సంతోషంగానే ఉన్నాడు. అంతేకాదు, తాను ఆకులు తింటూ బతుకుతుండడంతో తన తిండికి ఏ లోటూ లేదని చెబుతున్నాడు.
మెహమూద్ అనే ఈ వ్యక్తి పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలా జిల్లాకు చెందిన ఓ పేదవాడు. ఇతరుల ముందు చేయి చాచి అడుక్కోవడం ఇష్టంలేక ఇలా చెట్ల ఆకులు, బెరడులు తింటున్నానని చెబుతున్నాడు. ఆయనకు ఇన్నాళ్లకు ఓ పని దొరికింది. దీంతో ఇప్పుడు కాస్త డబ్బు సంపాదిస్తున్నప్పటికీ తనకు అలవాటయిపోయిన ఆకులే తింటున్నాడు. ఆయన ఇటువంటి ఆహారం తింటున్నప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికావడం లేదు.