: ముచ్చటగా మూడు కొత్త ఆఫర్లు ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
భారత టెలికం మార్కెట్లో తన వాటాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, తాజాగా మూడు ఆఫర్లను ఆవిష్కరించింది. దిల్ కోల్ కె బోల్ పేరిట ఎస్టీవీ (స్పెషల్ టారిఫ్ ఓచర్) రూ. 349కి, ట్రిపుల్ ఏస్ పేరిట రూ. 333, నెహెల్ పర్ దేహ్లా పేరిట రూ. 395కు ఆఫర్లను దగ్గర చేశామని, వీటితో రోజుకు 3 గిగాబైట్ల డేటాను వాడుకోవచ్చని పేర్కొంది. ఇప్పటివరకూ 2 గిగాబైట్లు అందే డేటాను మరో గిగాబైట్ పెంచామని తెలిపింది.
ఈ మూడు ప్లాన్ లలో వాయిస్ కాలింగ్ లాభాలు అందుకోవచ్చని, వాలిడిటీ 28 రోజులని తెలిపింది. 'దిల్ కోల్ కె బోల్' కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ తో పాటు రోజుకు 2జీబీ డేటా, 'ట్రిపుల్ ఏస్' ప్లాన్ లో భాగంగా 90 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా వాడుకోవచ్చని, 'నెహెల్ పర్ దెహ్లా' కింద రోజుకు 2జీబీ డేటా, 3000 బీఎస్ఎన్ఎల్ టూ బీఎస్ఎన్ఎల్ ఉచిత కాలింగ్, 1800 నిమిషాల ఇతర నెట్ వర్క్ ఫోన్లకు కాల్స్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్లు వచ్చే 71 రోజుల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.