: కోహ్లీని త్వరలోనే కలుసుకోవాలనుకుంటున్నా: షాహిద్ ఆఫ్రిదీ


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు ఇచ్చిన అపురూపమైన బహుమతిని చూసి పాక్ స్టార్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ ఎంతో సంతోషిస్తున్నాడు. తనకు ఇంత మంచి వీడ్కోలు బహుమతి ఇచ్చినందుకు కోహ్లీకి, టీమిండియా సభ్యులకు ధన్యవాదాలు అని తెలిపాడు. కోహ్లీ ఓ సూపర్ స్టార్ అంటూ కితాబిచ్చాడు. కోహ్లీని త్వరలోనే కలవాలని తాను ఉవ్విళ్లూరుతున్నట్టు తెలిపాడు. విరాట్ కోహ్లీకి చెందిన 18వ నంబర్ జెర్సీని ఆఫ్రిదీకి కోహ్లీ కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తనతోపాటు ఇతర భారత క్రికెటర్ల సంతకాలు ఆ టీషర్ట్ పై ఉన్నాయి. అంతేకాదు... 'షాహిద్ భాయ్, మైదానంలో నీతో తలపడటం ఎప్పుడైనా ప్రత్యేకమే' అంటూ ఓ వ్యాఖ్యను కూడా దానిపై కోహ్లీ రాశాడు. కరాచీలో ఆఫ్రిదీ ఇటీవలే కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ ఇంట్లో కోహ్లీ ఇచ్చిన జెర్సీని ఫ్రేం కట్టించుకుని పెట్టుకున్నాడు.

  • Loading...

More Telugu News