: హిందూ యువకులను పెళ్లి చేసుకుంటే ఉత్తమం: అక్కకు జరిగిన అన్యాయంపై రగిలిన ముస్లిం యువతి


మూడు సార్లు 'తలాక్' చెప్పి తన అక్కకు విడాకులు ఇచ్చి తీవ్ర అన్యాయం చేసిన విషయమై, ఓ ముస్లిం యువతి ధైర్యంగా స్పందించింది. సోదరికి జరిగిన అన్యాయంపై రగిలిపోతూ కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితాంతమూ ట్రిపుల్ తలాక్ గురించి ఆలోచించి భయపడుతూ తానెందుకు బతకాలని ఏకంగా పోలీసుల ముందు ప్రశ్నించింది.

ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కచ్చా పోలీసు స్టేషన్ కు వచ్చిన ఈ యువతి, ఏ క్షణమైనా భార్యను వదిలేసేలా నిబంధనలు ఉన్న మతంతో లాభమేంటని, భార్యను వదిలివేసే అవకాశం ఉన్న వ్యక్తితో జీవితాంతమూ ఎలా ఉండగలనని ప్రశ్నించింది. దీనికన్నా హిందూ మతాన్ని స్వీకరించి, హిందూ వ్యక్తిని పెళ్లాడటం ఉత్తమమని అంది. ఇండియాలో ముస్లిం మహిళల కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలు తృప్తికరంగా ఉన్నాయని, ట్రిపుల్ తలాక్ కు తక్షణం స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News