: హాలీవుడ్ సినిమాల్లో స్టంట్ లాంటి షాకింగ్ సీన్ జాతీయ రహదారి నడి రోడ్డు మీద...మీరూ చూడండి!
హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ట్రాన్స్ ఫార్మర్స్ ల్లో యాక్షన్ సీన్స్ తరహాలో ఒక రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడమే కాకుండా సుమారు 4 మైళ్లు ఈడ్చుకెళ్లిన ఘటన అమెరికాలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... సదరన్ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో మౌంటెన్స్ నుంచి శాన్ గాబ్రియెల్ మౌంటెన్స్ మధ్యనున్న జాతీయ రహదారిపై వెళ్తున్న నిస్సాన్ కారును మలుపులో దాని పక్కనుంచి వెళ్తున్న ట్రక్కు కుడిచేతివైపు ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారు డోరు ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది.
దీంతో ఆ నిస్సాన్ కారును ట్రక్కు సుమారు 4 మైళ్ల దూరం ఈడ్చుకెళ్లిపోయింది. అటుగా వస్తున్న బ్రైన్ స్టీమ్కే అనే వ్యక్తి దీనిని చూసి వీడియో తీస్తుండగా, ట్రక్కు డ్రైవర్ ఆపడంలేదు...కొంచెం సాయం చేయండి అని ఆ నిస్సాన్ కారులోని డ్రైవర్ అరవడంతో ఆ ట్రక్కును ఆపేందుకు ఆయన దూసుకెళ్లారు. ఇంతలో ఆ వ్యక్తి తన కారును ట్రక్కుకు అడ్డం పెట్టి ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే ట్రక్కు చక్రాల్లో ఇరుక్కున్న నిస్సాన్ కారు నుంచి పొగలు వచ్చాయి. అయితే దీనిపై తనకు తెలియదని, దానిని తాను చూడలేదని ఆ ట్రక్కు డ్రైవర్ కూల్ గా సమాధానం చెప్పడం అక్కడి వారికి ఆగ్రహం కలిగించింది. ఆ వీడియో మీరు కూడా చూడండి.