: ఊరు శభాష్ అంటోంది...లక్ష్యం నెరవేర్చుకున్న తరువాతే పెళ్లి పీటలెక్కిన యువకుడు!
మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలోని హేవరి గ్రామ సేవకుడిగా పని చేస్తున్న కిశోర్ విభూతేను చూసి గ్రామం గర్విస్తోంది. గ్రామ సేవకుడిగా పనిచేస్తున్న కిశోర్ విభూతే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం చూసి స్ఫూర్తి పొందారు. తమ గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇల్లు అన్నది ఉండకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో 2014 గణాంకాలు చూడగా... గ్రామంలో 351 ఇళ్లు ఉండగా అందులో 174 ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. మిగిలిన 177 ఇళ్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తైన అనంతరమే వివాహం చేసుకుంటానని, నాసిక్ లో జరిగిన ఒక సమావేశంలో శపథం చేశాడు. అప్పటి నుంచి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. రెండేళ్లు తిరగకుండానే లక్ష్యాన్ని సాధించాడు. ఏడాది క్రితమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ నాసిక్ జిల్లా యంత్రాంగం తనిఖీలు చేసి అధికార గుర్తింపునిచ్చే వరకు ఆగాడు. దీంతో నిన్న నాసిక్ అధికారులు గుర్తింపునివ్వడంతో లాతూర్ జిల్లాలోని తన స్వగ్రామం సంగం గ్రామంలో పెళ్లి పీటలెక్కాడు.