: దినకరన్‌తో నా ప్రాణాలకు ముప్పు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన మధుసూదనన్
అధికార అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్‌తో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ అన్నాడీఎంకే (పురుచ్చితలైవి అమ్మ) పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఇ.మధుసూదనన్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగినప్పటి నుంచి దినకరన్, ఆ పార్టీ ఎమ్మెల్యే వెట్రివేల్‌లు కలిసి అనుచరుల ద్వారా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి వల్ల తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు మధుసూదన్ తరపు న్యాయవాది విజయకుమార్ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదును సమర్పించారు. ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేస్తున్న సమయంలో దినకరన్, వెట్రివేల్ రప్పించిన గూండాలు తన ఇంటిని చుట్టిముట్టి, డమ్మీ అభ్యర్థి రాజేశ్‌ను బెదిరించారని ఫిర్యాదులో ఆరోపించారు. వారిద్దరూ కలిసి తనను, రాజేశ్‌ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, తనకు, రాజేశ్‌కు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు.